మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (12:27 IST)

జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్‌పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ ఎందుకు?

'నందమూరి హీరో బాలయ్య తాజా సినిమా పైసా వసూల్ టీజర్ డైలాగులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అంటూ బాలయ్య చెప్పే డైలాగులకు నెట్లో ప్యారడీలుగా వాడేస్తున్నారు. ఈ డైలాగును

'నందమూరి హీరో బాలయ్య తాజా సినిమా పైసా వసూల్ టీజర్ డైలాగులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అంటూ బాలయ్య చెప్పే డైలాగులకు నెట్లో ప్యారడీలుగా వాడేస్తున్నారు. ఈ డైలాగును తాజాగా తమ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి 'ఆనందో బ్రహ్మ' టీమ్ కూడా వాడుకుంటోంది.
 
ఈ సినిమా కొత్త ప్రోమోలో అన్నా రెండు బాల్కని టిక్కెట్లు కావాలి ఆనందో బ్రహ్మ సినిమా చూడాలి అంటూ షకలక శంకర్ వాయిస్ వస్తోంది. బాలయ్య వాయిస్ వినిపించే చోట జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ వాయిస్ వినిపించడం ఏమిటని బాలయ్య ఫైర్ అవుతున్నారు. 
 
అయితే షకలక శంకర్ వల్ల తమ 'పైసా వసూల్' సినిమాకు మరింత ప్రమోషన్ జరుగుతోందంటూ సినీ యూనిట్ సభ్యులు పండగ చేసుకుంటున్నారు. కాగా పైసా వసూల్ ఆడియో ఆగస్టు 17న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.