శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (10:08 IST)

పవన్ కళ్యాణ్ నేల విడిచి సాము చేయడు.. అదే అతని క్రేజ్‌... శేఖర్ కమ్ముల

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ గురించి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ముఖ్యంగా పవన్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటానికి గల కారణాలను ఆయన వివరించాడు.

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ గురించి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ముఖ్యంగా పవన్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటానికి గల కారణాలను ఆయన వివరించాడు. 
 
సినిమాల్లో హీరోలు రకరకాలుగా హీరోయిజాన్ని చూపిస్తుంటారు. చాలా ఉన్నతమైన విలువలు కల పాత్రలు ధరిస్తుంటారు. కానీ కొందరు అలా ఉండకపోవచ్చు. అయితే రీల్ లైఫ్ లోనూ, రియల్ లైఫ్‌లోనూ కూడా ఉన్నతమైన వారున్నారు. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. 
 
ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న హీరోల్లో చాల మంది తమ మొదటి సినిమాలోనే తమ టాలెంట్ మొత్తం ప్రదర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం తన కెరీర్ బిగినింగ్‌లో తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడులాంటి కొన్ని మంచి ఫ్యామిలీ మూవీస్ చేశాడని గుర్తు చేశారు.
 
ఆ సినిమాల్లో పవన్ మన పక్కింటి అబ్బాయిలాగానే కనిపించాడన్నాడు. పవన్ ఏదైనా తప్పు చేసినా, దాన్నుంచి మంచి నేర్చుకుంటాడు. నేల విడిచి సాము చేయడు.. అని శేఖర్ కమ్ముల మెచ్చుకున్నాడు. పవన్ కు ఈ స్థాయిలో క్రేజ్ ఉండటానికి అదే కారణమని అన్నాడు. అదేసమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని శేఖర్ కమ్ముల కొనియాడారు.