శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (22:59 IST)

భర్త పోయినా.. వయసు మీద పడినా తప్పేముంది..? కోరికలెక్కువ అంటోన్న రమ్యకృష్ణ

ఐదు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతుంది రమ్యకృష్ణ. సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకుంటూ ఔరా అనిపిస్తుంది రమ్యకృష్ణ. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే.. అప్పుడప్పుడూ సంచలన పాత్రలకు కూడా ఓకే చెప్తుంది. తాజాగా ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఇప్పటికే రెండేళ్ల క్రితం సూపర్ డీలక్స్ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది రమ్యకృష్ణ. అంతకుముందు మలయాళంలో కూడా బోల్డ్ క్యారెక్టర్ చేసింది. కథ డిమాండ్ చేస్తే ఇప్పటికీ బోల్డ్ సీన్లలో నటించేందుకు అభ్యంతరం లేదని హింట్ ఇచ్చేసింది. ఇప్పుడు మరోసారి బోల్డ్ పాత్రలో నటిస్తోంది.
 
వయసు మీదపడిన తర్వాత కూడా హార్మన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువగా ఉండే మహిళ పాత్రలో రమ్యకృష్ణ నటించబోతోంది. అప్పటికే భర్త చనిపోతే.. అప్పుడు ఆమె ఏం చేయాలి.. ఏమి చేస్తే తప్పు కాదు లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. నిజంగా ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్‌లో నటించడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు రమ్యకృష్ణ ఈ కారెక్టర్ చేయడానికి ఒప్పుకుని సంచలనం రేపుతుంది.
 
ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తూనే.. దేవత క్యారెక్టర్లు చేస్తూ దండాలు పెట్టించుకుంది రమ్యకృష్ణ. ఆ తర్వాత మధ్యలో కెరీర్‌లో కాస్త డల్ అయిన ఈమె.. బాహుబలిలో శివగామి పాత్రతో ఇండియన్ వైడ్‌గా మరోసారి స్టార్ అయిపోంది. 
 
ఆ సినిమా తర్వాత ఒక్కో సినిమాకు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రమ్యకృష్ణ.. డబుల్ పారితోషికంతో ఈ కారెక్టర్‌కు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.