గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:15 IST)

మేకప్‌మేన్‌కు కరోనా పాజిటివ్-క్వారంటైన్‌లోకి హీరో ప్రభాస్

హీరో ప్రభాస్‌ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆయన మేకప్‌మన్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందుకని, రాధే శ్యామ్‌ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభాస్‌ సహా చిత్రబృందమంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
కరోనా నేపథ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లాలని, అప్పటివరకూ షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ చేస్తే సినిమా పూర్తవుతుంది. 
 
కానీ, పరిస్థితులు అనుకూలించడం లేదు. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీని యు.వి. క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.