శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (20:50 IST)

'రంగమార్తాండ`లో పుట్ట‌నరోజున ఎంట‌ర‌యిన రాజ్‌

Ramyakrishna, prakashraj
ప్ర‌కాష్‌రాజ్ పుట్టిన‌రోజు శ‌నివారం. ఈ సంద‌ర్భంగా సోష‌ల్‌మీడియాలో ఆయ‌న న‌టిస్తున్న సినిమా రంగ‌మార్తాండ లుక్‌ను పోస్ట్ చేశాడు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా `రంగమార్తాండ`.ఇది ‌మరాఠీ సూపర్ హిట్ 'నట సమ్రాట్‌`కు రీమేక్‌. ప్ర‌కాష్‌రాజ్ ప‌క్క‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది. ఒక‌వైపు త‌న భ‌ర్త ద‌ర్శ‌కుడు. మ‌రోవైపు సినిమా భ‌ర్త అంటూ సెటిజ‌న్లు ప్ర‌కాష్‌రాజ్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ స‌ర‌దాగా కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఇందులో ప్ర‌కాష్ త‌న న‌ట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించే పాత్ర అట‌. అందుకు త‌గిన‌ట్లుగా ర‌మ్య‌కృష్ణ పాత్ర డిజైన్ చేశారు. ఈ సినిమా ఇప్ప‌టికి ముప్పై శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది తెలుస్తోంది. ఇంకా పూర్తివివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.