శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:37 IST)

ఫుల్లుగా తాగి హంగామా చేసిన బుల్లితెర నటి..

సినీ రంగానికి చెందిన అనేక మంది బాగా మందుకొట్టి పోలీసులకు చుక్కలు చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో బుల్లితెర నటి కూడా ఇలానే చేసి పోలీసులపై విరుచుకుపడింది. బుల్లితెర నటి రుహి శైలేష్ కుమార్ సింగ్ ఫుల్లుగా తాగి హల్‌చల్ చేసింది. తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తు ఏడు వాహనాల్ని ఢీకొట్టింది. ముంబైలోని శాంతాక్రజ్ దగ్గర ఈ ఘటన జరగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
తాను మద్యం సేవించి వాహనం నడపలేదంటూ పోలీసులతో వాదనకు దిగింది. పోలీసులు తనపై అసభ్యంగా ప్రవర్తించారంటూ నానా హంగామా చేసింది. కానీ సీన్ రివర్స్ అవ్వంది. ఈ ఘటన నుంచి తప్పించుకోవటానికి ఆమె చేసిన హల్‌చల్ సీన్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆ నటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.