ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:45 IST)

చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు యేడాది జైలు...

సినీ నటుడు, వైకాపా నేత మంచు మోహన్ బాబుకు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. రూ.48 లక్షల చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది. 
 
మోహన్‌ బాబుపై ప్రముఖ నిర్మాత వైవీఎస్ చౌదరి 2010లో పెట్టిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఒక యేడాది జైలుతో పాటు రూ.41.75 లక్షల అపరాధం కూడా విధించింది. ఈ చెక్ బౌన్స్ కేసులో ఏ1గా ఆయన సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్ పిక్చర్స్‌ ఉంటే, మోహన్ బాబు ఏ2గా ఉన్నారు.