సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:57 IST)

చంద్రబాబు దుర్మార్గంపై ఎన్టీఆర్ అప్పుడే చెప్పారు.. మోహన్ బాబు

ఏపీ సీఎం చంద్రబాబు దుర్మార్గం గురించి ఎన్టీఆరే చెప్పారని, ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన వ్యక్తి చంద్రబాబే అని వైసీపీ నాయకుడు, సినీ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ మోసపోతారు కనుక ఒకసారి జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. 
 
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే రక్తం తాగేస్తాడని ఓటర్లను హెచ్చరించారు. చంద్రబాబుకు నిలువెల్లా విషమేనని, ఎన్టీఆర్ కుటుంబాన్ని తొక్కి పారేశాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నీతి మంతుడైతే వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తాడని ప్రశ్నించారు. 
 
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధి ఆళ్శ రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ బాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న 11 కేసులను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారని, ఊసర వెల్లిలా రంగులు మారుస్తాడని ఫైర్ అయ్యారు.