శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 9 డిశెంబరు 2018 (10:00 IST)

డైమండ్స్ వ్యాపారి హత్య కేసులో టీవీ నటి అరెస్టు

ముంబైకు చెందిన డైమండ్స్ వ్యాపారి హత్య కేసులో టీవీ నటి డెబోలినా భట్టాచార్యను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసిన తర్వాత అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకు చెందిన వజ్రాల వ్యాపారి రాజేశ్వర్‌ ఉడాని ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ కేసులో రాజకీయ నాయకుడు సచిన్‌ పవార్‌ను అరెస్టు చేసిన పోలీసులు, టీవీ నటి డెబోలినా భట్టాచార్యను కూడా విచారించారు. సుమారు రెండు గంటల పాటు ఆమె వద్ద విచారణ జరిపిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, వారం రోజుల క్రితం రాజేశ్వర్‌ ఉడాని కనిపించకుండా పోయారు. దీనిపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉడాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన అతడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో రాయ్‌గఢ్‌ జిల్లాలోని అడవుల్లో గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అయితే, రాజేశ్వర్‌ కాల్‌డేటా ఆధారంగా అదృశ్యమవడానికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే డెబోలినా భట్టాచార్యను విచారించి అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ నేత సచిన్‌ పవార్‌ ద్వారా పలువురు మహిళలతో రాజేశ్‌కు పరిచయం ఏర్పడింది. సినీ ఇండస్ట్రీ, బార్‌ డాన్సర్లతో అతడు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండేవాడని కాల్‌డేటా ఆధారంగా వెల్లడైంది.