సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (16:07 IST)

దీపావళి గిఫ్టులుగా ఉద్యోగులకు ఖరీదైన కార్లు... ఎవరిచ్చారు?

సావ్‌జీ ఢోలాకియా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి. తన మామ వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకుని చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం దేశంలో ఉన్న ధనవంతుల్లో ఈయన ఒకరు. హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్ పేరుతో తన వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నారు.
 
అయితే, తన సంస్థలో పని చేసే ఉద్యోగులందరికీ ప్రతి దీపావళి పండుగకు ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉంటారు. ఈ యేడాది కూడా 600 మంది ఉద్యోగులకు మారుతి సుజుకి కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు. మరికొందరికి నగలు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 
 
అదేవిధంగా సంస్థలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు ఈ యేడాది ఆగస్టు నెలలో ఢోలాకియా ఏకంగా మెర్సెడీజ్ బెంజ్ జీఎల్‌ఎస్ 350డీ ఎస్‌యూవీలను బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లు. 
 
అలాగే, కంపెనీలో అత్యుత్తమంగా పని చేసిన ఉద్యోగులకు గతంలోనూ వేల కొద్దీ కార్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు ఢోలాకియా. గతంలో ఈయన కొడుకే కేరళలో నెల రోజుల పాటు ఓ సాధారణ వ్యక్తి జీవితం గడిపి వార్తల్లో నిలిచాడు.