బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (16:00 IST)

జర్మనీలో డీజిల్ కార్లను నిషేధించిన కోర్టు... మరి ఢిల్లీలో కూడా అమలు చేస్తారా?

జర్మనీలో డీజిల్ కార్లను నిషేధించింది. ఈ మేరకు ఆ దేశపు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజీల్ కార్లపై నగరాలు నిషేధం విధించవచ్చని పేర్కొంది.

జర్మనీలో డీజిల్ కార్లను నిషేధించింది. ఈ మేరకు ఆ దేశపు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజీల్ కార్లపై నగరాలు నిషేధం విధించవచ్చని పేర్కొంది. 
 
గాలి స్వచ్ఛతను కాపాడటంకోసం పాత, సరైన కండిషన్‌లోలేని వాహనాలను స్థానిక అధికారులు బ్యాన్ చేయవచ్చని లీప్ జిగ్‌లోని ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు తెలిపింది. కోర్టు నిర్ణయంతో ఇన్నర్ సిటీలలోని వాహనాల యజమానులతో పాటు, ఆటో ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడనుంది. 
 
డీజిల్ కార్లపై తనంతట తాను కోర్టు నిషేధం విధించనప్పటికీ... నిషేధం విధించే అధికారం స్థానిక నగర, మునిసిపల్ అధికారులకు ఉంటుందని స్పష్టంచేసింది. కొన్ని మినహాయింపులతో బ్యాన్‌ను అమలు చేయవచ్చని పేర్కొంది. కోర్టు తీర్పుతో ఆటోమొబైల్ కంపెనీలు షాక్ తిన్నాయి.
 
కాగా, కోర్టు తీర్పుపై జర్మనీ ఛాన్సెల్లర్ ఏంజెలా మెర్కెల్ కూడా స్పందించారు. తీర్పు మొత్తం దేశానికి వర్తించదని... ఏ నగరమైనా లేదా మున్సిపాలిటీ అయినా దేనికది నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. మరోవైపు కోర్టు తీర్పు పట్ల పర్యావరణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
నిజానికి తీవ్రమైన వాతారణ కాలుష్యాన్ని ఢిల్లీ నగరం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, శీతాకాలంలో ఈ నగరంలో గాలి కాలుష్యం మరింతగా దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ తరహా నిషేధాన్ని ఢిల్లీలో అమలు చేయాలని పర్యావరణ ప్రేమికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు.