సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

రంగస్థలం - మహానటికి దక్కలని చోటు ... అస్సామీ చిత్రానికి ఛాన్స్

అస్సామీ సినిమా ఇప్పుడు ఆస్కార్‌కు పోటీ పడనున్నది. రిమా దాస్‌ దర్శకత్వం వహించిన 'విలేజ్‌ రాక్‌స్టార్స్‌' ఫిల్మ్‌.. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్స్‌ పోటీలకు భారత్‌ తరపున అర్హత సాధించింది. 2019, ఫిబ్రవరి

అస్సామీ సినిమా ఇప్పుడు ఆస్కార్‌కు పోటీ పడనున్నది. రిమా దాస్‌ దర్శకత్వం వహించిన 'విలేజ్‌ రాక్‌స్టార్స్‌' ఫిల్మ్‌.. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్స్‌ పోటీలకు భారత్‌ తరపున అర్హత సాధించింది. 2019, ఫిబ్రవరి 24న అకాడమీ అవార్డుల ప్రధానం ఉంటుంది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ సినిమాను ఆస్కార్స్‌కు ఎంపిక చేయడం విశేషం.
 
కన్నడ ప్రొడ్యూసర్‌ రాజేంద్ర సింగ్‌ బాబు నేతృత్వంలోని జ్యూరీ ఈ సినిమాను ఎంపిక చేసింది. అస్సాంలోని చయ్యాగావ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. డైరెక్టర్‌ రిమాదాస్‌ స్వంత ఊరు ఇదే. పేద పిల్లలకు సంబంధించిన కథాంశంతో చిత్రాన్ని తీశారు. 'విలేజ్‌ రాక్‌స్టార్స్‌'కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది.
 
ఇకపోతే, తెలుగు సినిమాలకు ఆస్కార్ అవార్డుల్లో నిరాశ ఎదురైంది. టాలీవుడ్ నుంచి ప్రతిపాదించిన 'మహానటి', 'రంగస్థలం' సినిమాలకు చోటుదక్కలేదు. ఈ రెండు చిత్రాలు తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. 'మహానటి' చిత్రం లెజెండరీ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 
 
మరి ఈ రెండు చిత్రాల్లో ఒకటి కూడా ఆస్కార్‌కు ఎంపికకాకపోవడంపై టాలీవుడ్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్క సినిమాకైనా అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటూ.. అస్కార్‌కు ఎంపికైన 'విలేజ్ రాక్‌స్టార్స్' మూవీ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు తెలుగు ప్రేక్షకులు. కాగా, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో 'విలేజ్ రాక్‌స్టార్స్' చిత్రం ఆస్కార్ అవార్డ్‌కి పోటీ పడుతోంది.