ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ విజయఢంకా మోగించింది. దాయాది దేశమైన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్ధేశ

selvi| Last Updated: గురువారం, 20 సెప్టెంబరు 2018 (12:52 IST)
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ విజయఢంకా మోగించింది. దాయాది దేశమైన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్ధేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ధాటిగా ఆడి తర్వాతి బ్యాట్స్ మెన్‌కు ఇబ్బంది లేకుండా చూశారు. 
 
రెండు వికెట్లు మాత్రమే 29 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు (31), దినేష్ కార్తిక్ (31) నాటౌట్ గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లలో ఫహీమ్ అస్రాఫ్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
 
అంతకుముందు.. పాకిస్థాన్ బ్యాటింగ్ చేసిన సమయంలో భారత బౌలర్లు విజృంభించారు. పాకిస్థాన్ జట్టును కేవలం 162 పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత బౌలర్ల ఆదిపత్యమే కొనసాగింది. మధ్యలో షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అవుటైన తర్వాత మిగతా బ్యాట్‌మెన్స్ కూడా చేతులెత్తేశారు. 
 
దీంతో భారత జట్టు ముందు పాకిస్థాన్ 163 పరుగుల లక్ష్యాన్నే భారత్ ముందు వుంచగలిగింది. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 3, కేదార్ జాదవ్ 3, బుమ్రా 2, కుల్దీప్ యాద్ 1 వికెట్ తీసుకున్నారు. దీంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. దీనిపై మరింత చదవండి :