ఆసియా కప్ టోర్నీ : నేడు భారత్ తొలి మ్యాచ్

ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌ను మంగళవారం ఆడనుంది. ఇందులోభాగంగా తొలి ప్రత్యర్థి హాంకాంగ్ జట్టుతో తలపడనుంది. ఆసియాకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా ప్రధాన రౌండ్‌‌లోకి హా

rohit
pnr| Last Updated: మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (10:16 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌ను మంగళవారం ఆడనుంది. ఇందులోభాగంగా తొలి ప్రత్యర్థి హాంకాంగ్ జట్టుతో తలపడనుంది. ఆసియాకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా ప్రధాన రౌండ్‌‌లోకి హాంకాంగ్ జట్టు ప్రవేశించింది. దీంతో టాప్ ఫేవరేట్ టీమ్ అయిన భారత్‌తో తలపడనుంది.
 
ఇకపోతే, తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భారీ ఓటమిని చవిచూసిన హాంకాంగ్... మంగళవారం మ్యాచ్‌లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు, క్రికెట్ పసికూనే అని తేలికగా తీసుకోకుండా పక్కా ప్రణాళికతో పడగొట్టాలని చూస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే… మంగళవారం మ్యాచ్‌తో భారత్ ఖాతాలో భారీ విజయం చేరినట్లే. 
 
చాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్థాన్‌తో తొలిసారి తలపడబోతున్న భారత్.. హాంకాంగ్‌తో మ్యాచ్ ద్వారా జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. ధవన్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశముండగా, కేదార్ జాదవ్, అంబటి రాయడు, మనీశ్ పాండే, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్ మధ్య మిడిలార్డర్ పోటీ నెలకొని ఉంటుంది.
 
జట్ల అంచనా
భారత్: రోహిత్‌శర్మ(కెప్టెన్), ధవన్/రాహుల్, రాయుడు, మనీశ్‌పాండే, ధోనీ/దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా/అక్షర్ పటేల్, భువనేశ్వర్/శార్దుల్ ఠాకూర్, కుల్దీప్‌యాదవ్, బుమ్రా/ఖలీల్ అహ్మద్, చాహల్.
 
హాంకాంగ్: అన్షుమన్ రాత్(కెప్టెన్), నిజాకత్‌ఖాన్, బాబర్ హయత్, కించిత్ షా, క్రిస్టోఫర్ కార్టర్, ఎహసాన్ ఖాన్, ఐజాజ్‌ఖాన్, స్కాట్ మెక్‌కెచినీ, తన్వీర్ అఫ్జల్, ఎహసాన్ నవాజ్, నదీమ్ అహ్మద్.
 
పిచ్, వాతావరణం పిచ్ స్లో బౌలింగ్‌తో పాటు స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండవేడిమి కారణంగా ఉక్కపోతతో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
 దీనిపై మరింత చదవండి :