మలయాళ సీరియల్ నటి సూర్య శశికుమార్ అరెస్ట్ అయ్యింది.. ఎందుకో తెలుసా?
మలయాళం సీరియల్ నటి సూర్య శశికుమార్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను ముద్రించిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సూర్య శశికుమార్‌తో పాటు ఆమె తల్లి రీమా దేవి, సోదరి శ
మలయాళం సీరియల్ నటి సూర్య శశికుమార్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను ముద్రించిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సూర్య శశికుమార్‌తో పాటు ఆమె తల్లి రీమా దేవి, సోదరి శ్రుతిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
కొల్లాంలోని వారి ఇంట రూ.57లక్షల నకిలీ నోట్లను ముద్రించిన కేసులో సూర్య శశికుమార్‌ను అరెస్ట్ చేశామని ఇడుక్కి జిల్లా పోలీసు అధికారి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ కేసులో రీమా దేవిని ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.
కొల్లాంలోని వీరి నివాసం పై అంతస్థులో దొంగనోట్ల ముద్రణ జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. నకిలీ నోట్ల ముద్రణ కోసం రూ.4.36 లక్షలు ఖర్చు చేశారని, వచ్చిన లాభాల్లో సగం వాటా ఇవ్వాలనే ఒప్పందంతో దొంగనోట్లను చలామణి చేస్తున్నారని వెల్లడించారు.
ఇడుక్కిలో మూడు రోజుల క్రితం రూ. 2.25 లక్షల నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి, విచారించగా... సూర్య శశికుమార్, ఆమె తల్లి, సోదరిల పేర్లు వెలుగులోకి వచ్చాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి వుందని ఆయన తెలిపారు.