ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (11:37 IST)

బుల్లితెర నటిపై కుక్క దాడి... అయినా షూటింగ్ ఆపలేదు

బుల్లితెర నటిపై ఓ శునకం దాడి చేసింది. ఈ దాడిలో ఆ నటి తీవ్రంగా గాయపడినప్పటికీ.. ఆమె మాత్రం షూటింగ్ ఆపలేదు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

బుల్లితెర నటిపై ఓ శునకం దాడి చేసింది. ఈ దాడిలో ఆ నటి తీవ్రంగా గాయపడినప్పటికీ.. ఆమె మాత్రం షూటింగ్ ఆపలేదు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బుల్లితెర నటి ప్రాచీ తెహ్లన్ నటిస్తున్న హిందీ టీవీ సీరియల్ 'ఇక్యవాన్'. ఇందులో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లోని తదుపరి  ఎపిసోడ్ కోసం జర్మన్ షెపర్డ్ శునకంతో పాటు చిత్రీకరణ చేస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి ఆ శునకం ప్రాచీపై దాడికి దిగింది. ఆమె కాలును బలంగా కొరికింది. 
 
దీంతో అక్కడివారంతా ఆ శునకాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాచీని వెంటనే ఆసుపత్రికి తరలించి, ఆమెకు ఇంజెక్షన్లు వేయించారు. ఈ ఘటనతో షూటింగ్ నిలిపివేలాని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రాచీ మాత్రం షూటింగ్‌లో పాల్గొంది. ఈ సీరియల్‌‌లో తనది ధైర్యవంతురాలైన యువతి పాత్ర అని, ఆందుకే షూటింగ్‌కు విరామమివ్వలేదని తెలిపింది.