శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (18:51 IST)

మావోలు మెరుపుదాడి... 9 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి

మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మంగళవారం శక్తివంతమైన గ్రెనైడ్‌ను పేల్చారు. కిస్తారాం - పలోడీ రహదారిలో అమర్చిన ల్యాండ్‌మైన్‌ను పేల్చారు.

మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మంగళవారం శక్తివంతమైన గ్రెనైడ్‌ను పేల్చారు. కిస్తారాం - పలోడీ రహదారిలో అమర్చిన ల్యాండ్‌మైన్‌ను పేల్చారు. ఈ దాడిలో 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడగా, మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో సుమారు 100 మంది మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై మావోయిస్టుల దాడిలో 9 మంది జవాన్లు అమరులయ్యారు. కిస్తారాం రోడ్డులో మావోయిస్టులు పొంచి ఉండి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 100 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. 
 
ఈ దాడికోసం ఐఈడీ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన వారిని జిల్లా, ఏరియా ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దాడి జరిగిన సమయంలో వాహనంలో 15 మంది వరకు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉండగా, వీరంతా మైన్‌ప్రొటెక్టెడ్ వాహనంలో ప్రయాణిస్తున్నారు. అయితే, పేలుడు ధాటికి ఈ వాహనం తునాతునకలైపోయింది.