1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Russian model arrested after breaking spine while fleeing from alleged attacker

మోడల్‌పై వ్యాపారవేత్త అత్యాచారయత్నం.. ఆరో అంతస్తు నుంచి దూకేసింది.. వెన్నెముక?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తనపై జరుగుతున్న అత్యాచార యత్నం నుంచి తప్పించుకునేందుకు ఓ యువ మోడల్.. ఆరో అంతస్తు నుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాల పాలైంది. ఈ దుర్ఘటన దుబాయ్‌లో చోటుచేస

Russian model
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తనపై జరుగుతున్న అత్యాచార యత్నం నుంచి తప్పించుకునేందుకు ఓ యువ మోడల్.. ఆరో అంతస్తు నుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాల పాలైంది. ఈ దుర్ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన మోడల్, ఓ కాంట్రాక్టు పని కోసం దుబాయ్‌లోని ఓ స్టార్ హోటల్‌లో బస చేసింది. అదే హోటల్‌లో దిగిన అమెరికా వ్యాపారవేత్త ఆమెపై కన్నేశాడు. 
 
ఆమె గదికి వెళ్లి పరిచయం చేసుకుని.. ఆమెతో మాటా మాటా కలిపాడు. అలా ఆమెను మాటల్లో దించి.. మోడల్‌పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే తనపై జరుగుతున్న అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఈ దుర్ఘటనలో ఆమె వెన్నెముకకు తీవ్రగాయమైంది. 
 
ఆరో అంతస్తు నుంచి కిందకు పడిన ఆమెను వెంటనే హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. దీంతో అమెరికాకు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతనిపై నేరం రుజువైతే 15 సంవత్సరాల వరకు జైలుశిక్ష తప్పదని వార్తలొస్తున్నాయి.
About Writer
selvi
తర్వాతి కథనం
ప్రధాని మోడీని కలిసిన కొత్తపల్లి గీత... షోకాజ్ నోటీసులిచ్చిన వైకాపా