శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (17:17 IST)

ట్రంప్‌తో వివాహేతర సంబంధం.. ఆ డీల్‌ను బయటపెట్టొద్దు: ప్లేబాయ్ మాజీ మోడల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివాహేతర సంబంధాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 2006-07 మధ్యలో పదినెలల పాటు ట్రంప్‌తో సాగిన రహస్య సంబంధంపై చేసుకున్న ఒప్పందం నుంచి తనను బయటపడేయాలంటూ ప్లేబాయ్ మాజీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివాహేతర సంబంధాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 2006-07 మధ్యలో పదినెలల పాటు ట్రంప్‌తో సాగిన రహస్య సంబంధంపై చేసుకున్న ఒప్పందం నుంచి తనను బయటపడేయాలంటూ ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దావా వేశారు.

డొనాల్డ్ ట్రంప్‌తో ఎఫైర్ గురించి బయటకు వెల్లడించవద్దంటూ నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికా మీడియా ఇంక్ 2016లో తనకు లక్ష 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో తెలిపారు. 
 
ఈ సంస్థ అధిపతి డేవిడ్‌ పెకర్‌ గతంలో ట్రంప్‌ తన వ్యక్తిగత స్నేహితుడని ప్రకటించారు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు మహిళలతో వివాహేత సంబంధం వున్నట్లు కేసులు ఎదుర్కొంటున్నారు.

మొన్నటికి మెన్న అప్రెంటిస్ షో కంటెస్టెంట్ సమ్మర్ జెరోస్ లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ట్రంప్ తీరును బట్టబయలు చేయగా, గత నెలలో పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్ ట్రంప్‌తో వివాహేతర సంబంధం, అది బయటపడకుండా చేసుకున్న ఒప్పందం గురించి వెల్లడించి కలకలం రేపింది.