శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:30 IST)

భావన కేసు.. దిలీప్ కొత్త వాదన.. ఆ ఇద్దరు నన్ను ఇరికించారు..

మలయాళ నటీమణి కిడ్నాప్ కేసులో సినీ హీరో దిలీప్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసుపై దిలీప్ మాట్లాడుతూ.. తన మాజీ భార్య, దర్శకుడు, నటుడు లాల్ తనను ఇరికించారని ఆరోపించాడు.

మలయాళ నటీమణి కిడ్నాప్ కేసులో సినీ హీరో దిలీప్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసుపై దిలీప్ మాట్లాడుతూ.. తన మాజీ భార్య, దర్శకుడు, నటుడు లాల్ తనను ఇరికించారని ఆరోపించాడు. తనను ట్రాప్ చేసిన తన మాజీ భార్య మంజు వారియర్ కావాలనే ఈ కేసులో ఇరికించారన్నాడు. 
 
తన భార్యతో తనకు విభేదాలున్నాయని.. అలాగే లాల్‌తో తనకు పడదని.. వీరిద్దరూ కలిసి తనను పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. దీనిపై పల్సర్ సునీ మాట్లాడుతూ.. కిడ్నాప్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఈ కేసులో తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని.. నెలల పాటు జైలులో గడిపి నిందితుడిగా బెయిల్‌పై బయటకు వచ్చిన దిలీప్ చెప్పుకొచ్చాడు. 
 
ఇదిలా ఉంటే.. గత ఏడాది ఫిబ్రవరిలో భావన లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పల్సర్ సునీ.. అతనికి సహకరించిన వారిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై మలయాళ హీరో దిలీప్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో అతని ప్రమేయం వుందని తేలడంతో కొన్ని నెలల పాటు జైలులోనే గడిపాడు. 
 
బెయిల్ కోసం పిటిషన్ వేసినా పలుమార్లు కోర్టు తిరస్కరించింది. తాజాగా ఎట్టకేలకు దిలీప్‌కు బెయిల్ మంజూరు చేయడంతో బయటికి వచ్చాడు. ఈ కేసులో ప్రస్తుతం దిలీప్ ఎదురుదాడికి దిగడంతో.. భావన కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.