విజయ్ దేవరకొండ వల్ల తీవ్రంగా నష్టపోయాను : నిర్మాత అభిషేక్
హీరో విజయ్ దేవరకొండ వల్ల తీవ్రంగా నష్టపోయినట్టు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అభిషేక్ నామా ఆరోపించారు. ప్రస్తుతం నాగబంధం చిత్రంతో ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రం జూలై 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో విజయ్ దేవరకొండ హీరోగా 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. అయితే, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని, ఫలితంగా భారీ నష్టాలను చవిచూసినట్టు చెప్పారు. దీంతో విజయ్ దేవరకొండ ఒక్క రూపాయి కూడా అడగలేదని, ఆయన కూడా ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని చెప్పారు. అయితే, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మా బ్యానర్‌లో మరో సినిమా చేస్తారని ఆశించామని, ఇందుకోసం ఏకంగా మూడేళ్లపాటు ఎదురు చూశామని తెలిపారు. అయినా సరే ఆయన నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని వాపోయారు.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానరుపై కేఎస్ రామారావు నిర్మించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ తెర్సాలు హీరోహీరోయన్లుగా నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

