1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. kerintha reviews report

'హ్యాపీ డేస్‌'ను గుర్తుచేసే దిల్ రాజు 'కేరింత'... రివ్యూ రిపోర్ట్..

kerintha reviews report
సూపర్ హిట్ సినిమాల నిర్మాత దిల్ రాజు తాజాగా కేరింత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు వంటి యూత్ ఫుల్ మూవీ అంటూ మొదటి నుంచి కూడా ఈ సినిమా గురించి ప్రచారం చేశాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు బాగా ఏర్పడ్డాయి. ఇక సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్ట్ మీ కోసం..


సినిమా: కేరింత
దర్శకత్వం: సాయి కిరణ్ అడవి
నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : మిక్కి జే మేయర్
నటీనటులు : సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి, అవంతిక, లావణ్య త్రిపతి, నిత్య సురేష్, సుకృతి తదితరులు
 
చిత్ర కథ :
నూకరాజు (పార్వతీశం) ఈ సినిమాని ప్రారంభిస్తాడు. ప్రతి ఒక్కరికి కాలేజీ ఒక జ్ఞాపకం, స్నేహం, ప్రేమ వంటి జ్ఞాపకం….. ఆరుగురు స్నేహితుల గురించి చెప్పడం మొదలుపెడుతాడు నూకరాజు. మొదట జై (సుమంత్ అశ్విన్) ఫొటోగ్రఫీలో ఎమ్.ఏ చేస్తుంటాడు. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండడం అందరిని సంతోషపెట్టడం అతని నైజం. అలాంటి జై, మనస్విని (శ్రీ దివ్య)ని మొదటిచూపులోనే ప్రేమిస్తాడు.
 
ఆ తర్వాత పలు రకాల తంటాలుపడి ఆమె జాడ తెలుసుకుంటాడు. తీరా తెలిశాక ఆమెని ప్రేమలో పడేయడానికి నానా తంటాలు పడతాడు. ఇదిలా ఉంటె మనస్విని ఓ డాక్టర్ ఆస్ట్రేలియా వెళ్లి రీసెర్చ్ చేయాలనీ తన ఆశయం, ప్రేమలో పడితే తన ఆశయానికి అడ్డొస్తుంది అని జై ని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇక రెండో కథ నూకరాజు శ్రీకాకుళంలో నిరుపేద కుటుంబం నుంచి ఎం.ఏ చదవడానికి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ సంస్కృతి చూసి మరియు ఇక్కడి అమ్మాయిలకి ఆకర్షితుడై ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి ప్రేమలో పడేశానని అనుకుంటాడు. 
 
ఈ ప్రాసెస్‌లో భావన (సుకీర్తి) ప్రేమని అర్ధం చేసుకోలేడు. ఈ విషయం అర్ధం అయ్యి నూకరాజు తిరిగి భావన దగ్గరికి వచ్చినా ఆమె అంగీకరించదు. భావన బ్యూరోక్రాట్ ఆశయంగా సాగుతున్న భావన జీవితంలోకి వస్తాడు నూకరాజు. అతనంటే ఇష్టం ఉన్నా కానీ అతని ప్రవర్తన వలన నొచ్చుకొని నూకరాజుని దూరంగా ఉంచుతుంది.
 
సిద్దార్థ్ (విశ్వనాథ్) మ్యూజిక్‌లో ఎంఏ చేస్తున్నా అమ్మకి భయపడి ఇంట్లో ఎంసిఏ చేస్తున్నట్టు చెప్తాడు ఇలా ప్రతి విషయంలో అమ్మకి భయపడే సిద్దార్థ్, అప్పుడే అమెరికా నుండి వచ్చిన ప్రియ (తేజస్వి మదివాడ) ను చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం వాళ్ళ అమ్మతో చెప్పకుండానే చెప్పేసాను అని అబద్దం చెప్తాడు సిద్దార్థ్ ఈ విషయం తెలిసిన ప్రియ అతని నుండి దూరంగా వెళ్ళిపోతుంది.
 
జై, మనస్వినిలు కలిసారా? భావన ప్రేమను నూకరాజు ఎలా అర్ధం చేసుకున్నాడు? భావన నూకరాజుని అంగీకరించిందా? ప్రియ విషయం వాళ్ళ అమ్మకి సిద్దార్థ్ ఎలా చెప్పాడు అసలు చెప్పాడా లేదా?, ప్రియను ఎలా ఒప్పించాడు? అన్న ప్రశ్నలకి సమాధానాలే మిగిలిన స్టోరీ. 
 
ప్లస్ పాయింట్స్:
సుమంత్ అశ్విన్, మిక్కి జే మేయర్ సంగీతం, సినిమాటోగ్రఫీ, కొన్ని సన్నివేశాలు..
 
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్, కథనం, పాత్రల మధ్య ఎమోషన్స్ లేకపోవడం, రొటీన్ స్టొరీ, హీరోయిన్స్.
 
చివరిగా :
'కేరింత' ఓ మంచి యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్. స్నేహం విలువ‌ను.. ప్రేమ గొప్ప‌త‌నాన్ని.. మ‌నం మర్చిపోయిన తీపి జ్ఞాప‌కాల్ని మ‌రోసారి గుర్తు చేస్తుంది. అయితే చాలా చోట్ల హ్యాపీడేస్ గుర్తుకు రావ‌డ‌మే దీనికి మైన‌స్. లోపాలు వెత‌క‌డం మానేసి.. బ్లాంక్ మైండ్‌తో థియేట‌ర్స్‌కి వెళ్తే కేరింత బాగానే కేరింత పెట్టిస్తుంది.