రాధికా ఆఫ్టే ఆఫ్ న్యూడ్ విడియో.. ఇద్దరి అరెస్టు
‘లయన్' బ్యూటీ రాధిక ఆఫ్టే తిరిగి రచ్చకెక్కింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఆమె నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది. కొద్దిరోజుల కిందట ‘లివింగ్ టు గెదర్’తోపాటు మరికొన్ని అంశాలపై తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇదిలా ఉండగా రాధికాకు సంబంధించిన సెమీ న్యూడ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 20 నిమిషాల నిడివి గల ఓ షార్ట్ ఫిల్మ్ అది. దీనికి సంబంధించిన న్యూడ్ క్లిప్ లీకయ్యింది. ఆ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతోపాటు వాట్సప్‌లోనూ హల్‌చల్ చేస్తోంది. వెంటనే ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిపై దర్శకుడు ముంబై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టిన పోలీసులు, ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. న్యూడ్ క్లిప్ లీక్ వెనక వీరి హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు.