సంబంధిత వార్తలు
- అలీగారూ... ఏమిటిది? హాట్ టాపిగ్గా కామెంట్స్..
- జగన్ ఒక్క సీటు గెలిచినా కేసీఆర్ మనల్ని అమ్మేస్తాడు : చంద్రబాబు
- నా అల్లుడికి సీటా... నేనున్నాగా.. మళ్ళీ పోటీ చేస్తా.. బాలక్రిష్ణ
- జగన్ అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కేసీఆర్ కప్పం కట్టించుకుంటారు: చంద్రబాబు
- ఆ చిత్రంతో రంగు పడింది... బోయపాటితో బాలయ్య సినిమా షాకింగ్ న్యూస్
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన అలీ... పవన్ కల్యాణ్‌కు చెప్పే చేరిన అలీ?
సినీ నటుడు అలీ... గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే... తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు రాకపోవడంతో ఈసారి తనకు ఎవరైతే గుర్తింపు, ఆశించిన పదవి ఇస్తారో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని పాదయాత్ర సమయంలో కలవడం... ఆ తర్వాత చంద్రబాబును కలవడం... ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ని కలవడం తెలిసిందే. దీంతో అలీ వైసీపీలో చేరనున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే.. జగన్‌ని కలిసింది వాస్తవమే కానీ... పార్టీలో చేరే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎవరైతే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తారో ఆ పార్టీలో చేరుతానని చెప్పారు. ఐతే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటారనీ, గుంటూరు నుంచి పోటీ చేయనున్నారు అంటూ జోరుగా ప్రచారం జరిగింది.
కానీ... ఏమైందో ఏమో కానీ... అలీ చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైసీపీలో చేరారు. అలీని తన పార్టీలోకి ఆహ్వానించారు జగన్. అయితే... ఏ నియోజకవర్గం నుంచి అలీ పోటీ చేయనున్నారు అనేది తెలియాల్సి వుంది. కాగా వైకాపాలో చేరుతున్న సంగతి పవన్ కల్యాణ్‌కు చెప్పే చేరినట్లు సమాచారం.
