ఆ చిత్రంతో రంగు పడింది... బోయపాటితో బాలయ్య సినిమా షాకింగ్ న్యూస్
నందమూరి నట సింహం బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడం.. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే. తదుపరి చిత్రాన్ని ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్టు ప్రకటించారు అయితే... ఈ సినిమా ఫిబ్రవరి నుంచే సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. కానీ... వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే సక్సస్ సాధించాలనే పట్టుదలతో బోయపాటి స్ర్కిప్ట్ పైన మరోసారి వర్క్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే... ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాని ఎన్.బి.కె బ్యానర్‌లో బాలకృష్ణ నిర్మించనున్నట్టు ఎనౌన్స్ చేసారు కానీ.. ఇప్పుడు సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఎన్టీఆర్ బయోపిక్ భారీ నష్టాలను తీసుకురావడంతో బాలయ్య నిర్మాణం నుంచి తప్పుకోవాలని ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట.
ఈ సినిమాని మార్చి 28న పూజా కార్యక్రమాలతో ప్రారంభించి... రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఎన్నికల అనంతరం ప్రారంభిస్తారట. మరో విషయం ఏంటంటే... ఈ మూవీ కోసం రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా శ్రీనాథ్‌లను సంప్రదించినట్టు సమాచారం. మరి... త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారేమో చూడాలి.