పాపం బోయపాటి పరిస్థితి ఇలా అయిపోయిందేంటి?
సింహా, లెజెండ్, సరైనోడు.. అంటూ బ్లాక్ బష్టర్స్ అందించిన బోయపాటి పరిస్థితి ఇప్పుడు ఏం బాలేదు. అవును.. ఎప్పుడైతే వినయ విధేయ రామ సినిమా డిజాష్టర్ అయ్యిందో అప్పటి నుంచి బోయపాటి టైమ్ ఏం బాలేదు. ఈ సినిమా ఫుల్ రన్ పూర్తైన తర్వాత రామ్ చరణ్ బహిరంగ లేఖ రాయడం అభిమానులకు... అందులో బోయపాటి పేరు ప్రస్తావించకపోవడం... ఆ తర్వాత నిర్మాత దానయ్య, బోయపాటి మధ్య మాటల యుద్ధం జరగడం ఎంత వివాదస్పదం అయ్యిందో తెలిసిందే.
అయితే... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు అడ్వాన్స్ పేరు ఎత్తకుండా మా సినిమా పరిస్థితి ఏంటి అని అడిగిందట తెలివిగా. ఇంకా టైమ్ పడుతుంది అని చెప్పడంతో సదరు నిర్మాణ సంస్థ వెంటనే సినిమా అయినా చేయాలి లేదంటే అడ్వాన్స్ అయినా తిరిగివ్వాలి లేదంటే కోర్టుకెళతాం అని చెప్పడంతో చేసేదేం లేక అడ్వాన్స్ ఇచ్చేసాడట. గీతా ఆర్ట్స్ సంస్థ కూడా బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చింది. మరి... ఈ అడ్వాన్స్ గురించి ఏం చేస్తాడో..?