గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 9 మార్చి 2019 (17:09 IST)

నా అల్లుడికి సీటా... నేనున్నాగా.. మళ్ళీ పోటీ చేస్తా.. బాలక్రిష్ణ

రాజకీయాల్లోకి ఒకసారి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళడం కష్టమే. అందులోను సినీప్రముఖులైతే ఇక అస్సలు వదలరు. ఒకవైపు సినీరంగంలో, మరోవైపు రాజకీయ రంగంలో రాణిస్తూ ప్రజలకు మరింత దగ్గరవ్వాలని చూస్తుంటారు.
 
తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలక్రిష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడిపికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలోని హిందూపురం ఎమ్మెల్యేగా ప్రస్తుతం బాలక్రిష్ణ ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ముందుగా బాలక్రిష్ణ భావించారు. ఆ స్థానంలో ఎవరినైనా నిలబెట్టవచ్చని చంద్రబాబుకు చెప్పారు.
 
కానీ మళ్ళీ బాలక్రిష్ణ తన మనస్సును మార్చుకున్నారట. మళ్ళీ తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట. మొదట్లో బాలక్రిష్ణ వద్దనుకున్న సమయంలో హిందూపురం సీటును నారా లోకేష్‌ బాబుకు ఇచ్చి పోటీ చేయించి గెలిపించాలని చంద్రబాబు భావించారట. కానీ ఉన్నట్లుండి బాలక్రిష్ణ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం.. తన అల్లుడికే టిక్కెట్టు ఇస్తున్నారని తెలిసినా పట్టించుకోకుండా తనకే సీటు కావాలంటూ తేల్చడంతో చంద్రబాబు ఏమీ చేయలేక మళ్ళీ అదే స్థానంలో బాలక్రిష్ణ పేరును ఖరారు చేసేందుకు సిద్థమయ్యారు. దీంతో లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆశక్తికరంగా మారుతోంది.