వరుడికి షాకిచ్చిన వధువు.. తాళికట్టే సమయంలో ప్రియుడు వస్తున్నాడని..?
Bride-Bridegroom
అయితే చివరి నిమిషంలో వధువు తనకు ఈ పెళ్లి వద్దంటూ కుటుంబ సభ్యులను, వరుడిని ఒప్పించే ప్రయత్నం చేసింది. తన ప్రియుడు వస్తున్నాడని చెప్పి పెళ్లి మండపం నుంచి లేచి వెళ్లిపోయింది. కూతురి ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు వధువును ప్రియుడికి అప్పగించారు. అదే మండపంలో వధువును ప్రియుడికిచ్చి వివాహం జరిపించారు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరిలో నివాసముంటున్న ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకే చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు ఇరువురి కుటుంబసభ్యులు. వివాహ వేడుకలో వరుడు తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రేమించిన వాడు అరగంటలో వస్తాడని చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు. ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చుట్టూ వున్న బంధువుల వైపు చూశాడు.
బంధువుల జోక్యం చేసుకుని సర్ది చెప్పబోతే వధువు ససేమిరా అంది. ఓ పెద్దావిడ మరికొంత జోక్యం చేసుకుని వధువుని నాలుగు దెబ్బలేసైనా ఒప్పిద్దామనుకుంటే.. వధువు ఆ పెద్దావిడకు ఎదురు తిరిగింది.
ఈ తంతు కొనసాగుతుండగానే ఎటూ తోచని వరుడు వివాహ వేడుక నుంచి వెళ్ళిపోయాడు. కుటుంసభ్యులు ఎంతగా వారించిన ప్రియదర్శిని మాట వినకపోవడంతో పెళ్లి వద్దంటూ వివాహ వేడుకనుండి వెళ్లిపోయాడు వరుడు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
తర్వాతి కథనం
