బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (16:35 IST)

ప్రీపెయిడ్ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మొబైల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం.. సూపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే కేవలం రూ.135 వోచర్‌ తీసుకున్న వారు 1440 నిమిషాల పాటు ఏ నెట్ వర్క్ వినియోగదారులకు అయిన ఫోన్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం కల్పించింది.

అయితే ఇదే ఆఫర్ గతంలో 300 నిమిషాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ఈ సరి కొత్త టారిఫ్ వోచర్ 24 రోజుల వ్యాలిడిటీతో అదనపు ప్రయోజనాలు కలిగి ఉంది.
 
ఇకపోతే ఈ టారిఫ్ యొక్క ప్రయోజనాలు చుస్తే. బీఎస్ఎన్ఎల్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు అనేవి ఆఫ్-నెట్, ఆన్-నెట్.. రెండింటిలోను ఉంటాయి. అంటే లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఏ నెట్ వర్క్‌కు అయినా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్టోబర్ 22వ తేదీలోగా రూ.160తో రీఛార్జ్ చేసుకున్న వారికి అంతే మొత్తాన్ని మూడు రోజుల పాటు వినియోగించుకునే సరికొత్త అవకాశం కుడా కస్టమర్లకు అందిస్తోంది.