1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Chief Minister Jagan Mohan Reddy's bail revocation case adjourned till June 1

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా

Chief Minister
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది.

జగన్ బెయిల్ రద్దు చేయలంటూ ఎంపీ  రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలుపగా... సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది.... ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని... జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
ఏడు రాష్ట్రాలను వణికిస్తున్న యాస్ సైక్లోన్ : ఎయిర్‌పోర్టులు మూసివేత