బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 25 మే 2021 (19:24 IST)

మూడు జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించిన సీఎస్‌

మూడు జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించడంలేదన్నారు. ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారని వివరించారు.
 
తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్‌ రోగులు లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నామనీ, ఆక్సిజన్‌ కొరత రాకుండా, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడ్డ పక్షంలో జనరేటర్లు, డీజిల్‌ అన్నీ సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
 
తుపాను నేపధ్యంలో జిల్లాల్లో తీసుకున్న చర్యలను సీఎంకు వివరించిన కలెక్టర్లు
జె.నివాస్‌, కలెక్టర్, శ్రీకాకుళం.
శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించిన కలెక్టర్‌ జె.నివాస్‌. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని వెల్లడి. ఆక్సిజన్‌ ట్యాంకర్ల రవాణాలో ఇబ్బందులు వచ్చిన పక్షంలో వెంటనే ఆ సమస్యను తీర్చడానికి ఇచ్ఛాపురం వద్ద ప్రత్యేక బృందాలను పెట్టామన్న కలెక్టర్‌ నివాస్‌.
 
డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం.
విజయనగరం జిల్లాలో పరిస్థితులను వివరించిన కలెక్టర్‌ జవహర్‌లాల్‌. జిల్లాలో ఇప్పటివకూ తుపాను ప్రభావం ఏమీ కనిపించలేదన్న జవహర్‌లాల్‌. తుపాను పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్న కలెక్టర్‌. కోవిడ్‌ రోగులు ఉన్న 28 ఆస్పత్రుల్లో అన్నిరకాల జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నామని వెల్లడి. నాలుగు రోజులకు సరిపడా డీజిలు అందుబాటులో ఉంచామని వెల్లడి.
 
నాలుగు రోజులకు సరిపడా మందులను ముందుగానే ఆయా ఆస్పత్రులకు అందుబాటులో ఉంచామని వెల్లడి. 4 రోజులకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలను అందుబాటులోకి ఉంచామని వెల్లడి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఆహారానికి లోటులేకుండా, సిలెండర్లు కూడా సిద్ధంగా ఉంచామన్న కలెక్టర్‌.
కరెంటు సరఫరాకు ఇబ్బంది వచ్చిన పక్షంలో పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్స్‌ అందుబాటులో ఉంచుకున్నామని సీఎంకు తెలిపిన కలెక్టర్‌. ఐఎండీ అలర్ట్స్‌ను మండలస్థాయి అధికారుల వరకూ పంపిస్తున్నాం అని చెప్పారు.
 
వి.వినయ్‌ చంద్, కలెక్టర్, విశాఖపట్నం
విశాఖ జిల్లాలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కలెక్టర్‌ వెల్లడి. అయినా సరే.. అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని వెల్లడి. ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లకు, సిలెండర్‌ ఫిల్లింగ్‌ ప్లాంట్లకు కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడి.
 
జిల్లాల్లో కోవిడ్‌రోగులకు సేవలు అందిస్తున్న సుమారు 80కి పైగా ఆస్పత్రుల్లో అన్నిరకాలుగా చర్యలు తీసుకున్నామని వెల్లడి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకున్నామని వెల్లడి.
 
పురపాలకశాఖ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్‌ ఛైర్మన్ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.