శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (14:11 IST)

రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తా .. బీజేపీలో చేరను : ఈటల రాజేందర్

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. 
 
తనను బీజేపీ నేతలు అధికారికంగా ఆహ్వానం పలికినట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలతో ఈటల ర‌హ‌స్యంగా స‌మావేశం కూడా అయ్యారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
దీనిపై ఈటల రాజేంద‌ర్ తాజాగా స్పందించారు. తాను మద్దతు కోరేందుకే బీజేపీ నేతలను కలిశానని, అంతేగానీ, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవమని చెప్పారు. 
 
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ హుజూరాబాద్‌ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారికంగా తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.