శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2021 (15:37 IST)

ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా, ఎందుకని?

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు. రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకరుకు పంపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు.
 
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులు తమ రాజీనామాలకు సిద్ధంగా వుండాలని శుక్రవారం గంటా పిలుపునిచ్చారు. ఈ మేరకు ముందుగా ఆయనే రాజీనామా చేసారు. ఐతే గంటా రాజీనామాతో కేంద్రంలో కదలిక వస్తుందా లేదా అన్నది చూడాలి.