1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Demolition of two huge buildings in Hyderabad

హైటెక్ సిటీలో భారీ భవనాలను క్షణాల్లో కూల్చేశారు.. (video)

Demolition
Demolition
హైదరాబాద్ హైటెక్ సిటీలో రెండు భారీ భవనాలను క్షణాల్లో కూల్చివేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హైటెక్ సిటీలోని రహేజా మైండ్ స్పేస్‌లోని రెండు భారీ భవనాలు క్షణాల్లో నేలమట్టం అయ్యాయి. 
 
ఈ భవనాలను పెద్ద పెద్ద పరికరాల సాయంతో కూల్చలేదు. సరికొత్త పద్ధతిలో ఇతర నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త భవనాలను నిర్మించేందుకు వీటిని కూల్చారు. రెండు భవనాలను కూల్చివేయడంతో చుట్టు పక్కల ప్రాంతం అంతా దుమ్ము ధూళి వ్యాపించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. 
 
భవనాల కూల్చివేతకు అధికారులు భారీగా పేలుడు పదార్థాలను వినియోగించారు. ఈ స్థానంలో కొత్త భవనాలను నిర్మించనున్నారు. కాగా ఈ భారీ భవనాల కూల్చివేత ప్రక్రియను ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ పర్యవేక్షించింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా