గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (22:35 IST)

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Assam CM Himanta Sarma
Assam CM Himanta Sarma
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్‌పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రినికి భుయాన్ శర్మ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేయడంతో ఈ పరువు నష్టం దావా వేశారు. 
 
ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందడం కోసం అవకతవకలకు పాల్పడ్డారని గొగోయ్ ఆరోపించారు. మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి కోర్టులో సెప్టెంబర్ 26న ఈ కేసు విచారణకు రానుంది.
 
కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ తన క్లయింట్ రినికికి చెందిన కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ గురించి అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు.