గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (18:49 IST)

పంజాబ్‌లో దారుణం.. తల్లిదండ్రుల కంటి ముందే కుమారుడి..?

murder
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. పంజాబ్‌లో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. పాత కక్షల కారణంగా ఓ యువకుడిని కొందరు దుండగులు బుధవారం దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. కపుర్తలాకు చెందిన హర్ దీప్ సింగ్ (22) అనే యువకుడిపై కొందరు దుండగులు హత్య చేసి ఇంటి ముందే పడేశారు. 
 
తల్లిదండ్రుల కళ్ల ముందే ఇంటి ముందు పడేసి కుమారుడిని చంపేశామని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. బాధితుడి తండ్రి గురునామ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి కబడ్డీ ప్లేయరని ప్రాథమిక విచారణలో తేలింది.