గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (20:02 IST)

వీడు తండ్రికాదు.. కిరాతకుడు.. కూతుర్ని చంపి.. బైకుకు కట్టి..?

crime scene
వీడు తండ్రికాదు.. కిరాతకుడు. తన కూతురు ప్రేమించిందని.. బైకుకు ఆమెను కట్టేసి రోడ్లు తిప్పాడు. ఈ ఘటనలో అతని కూతురు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్ సర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బావూ అనే వ్యక్తికి 5 మంది కూతుర్లు కాగా మూడవ కూతురు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, మరుసటి రోజు తిరిగొచ్చింది. దీంతో ఆగ్రహంతో చంపి బైకుకి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు. అనంతరం శవాన్ని రైలు పట్టాలపై పడేశాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు వీడు తండ్రేనా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు.