శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (19:31 IST)

చెర్రీ డాటర్ క్లిన్ కారా కొణిదెలకు అల్లు అర్జున్, ఎన్టీఆర్ గిప్ట్ ఏంటంటే?

Klin Kara
Klin Kara
రామ్ చరణ్, ఉపాసన కుమార్తె క్లిన్ కారా కొణిదెల రాకతో మెగా ఫ్యామిలీ చాలా హ్యాపీగా వుంది. ఇంకా క్లిన్ క్లారాకు కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ప్రేమ, బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు, క్లిన్ మామయ్య అల్లు అర్జున్ తన చిన్న మేనకోడలు కోసం చాలా ప్రత్యేకమైన బహుమతిని పంపారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఇందులో భాగంగా పుష్ప నటుడు క్లిన్ కారా కొణిదెలకి ఆమె పుట్టిన వివరాలు, పేరు చెక్కబడిన బంగారు పలకను బహుమతిగా ఇచ్చాడని తెలిసింది. అంతకుముందు, క్లిన్ పుట్టిన వెంటనే, ఆమెను చూడటానికి తన భార్య స్నేహతో కలిసి ఆసుపత్రికి వెళ్లాడు. 
 
ఇకపోతే.. రామ్ చరణ్ కుమార్తెకు మరిన్ని ఖరీదైన బహుమతులు అందాయి. రామ్ చరణ్‌కి సన్నిహితుడైన జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లిన్‌కి చాలా ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ నటుడు, అతని భార్య ప్రణతి దంపతులకు రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా పేర్లతో చెక్కబడిన బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు.
 
RRR షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, చరణ్ చాలా సోదర బంధాన్ని పెంచుకున్నారు. గత నెల, జూలై 20న, రామ్ చరణ్, ఉపాసన క్లిన్ కారా ఒక నెల పుట్టినరోజును జరుపుకున్నారు.