ఆదివారం, 3 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (17:43 IST)

ఆయన దగ్గర మాట తీసుకున్నా - మా తాతగారి గురించి చాలా చెప్పారు : హీరో సుశాంత్

Shushanth
Shushanth
మెగాస్టార్ చిరంజీవి మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో సుశాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
సెకండ్ ఇన్నింగ్స్ చాలా జోరుగా వున్నట్లుగా వుంది ?
నేను ఇనింగ్స్ అలా ఏం అనుకోలేదు. నేను మాములుగా ఆడేది టెస్ట్ మ్యాచ్. ఏదీ ప్లాన్ చేసింది కాదు. హీరో, గెస్ట్ రోల్, సపోర్టింగ్ ఇలా అన్నీ నాకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. ‘అల వైకుంఠపురము’ లో బన్నీ త్రివిక్రమ్ గారితో పని చేశాను. చాలా కొత్తగా చూపించారు. చాలా నేర్చుకున్నాను. అలాగే రావణాసురలో కూడా డిఫరెంట్ గా చూపించారు. ‘భోళా శంకర్’ విషయానికి వస్తే.. చిరంజీవి గారితో పని చేయాలనే ఆలోచనే చాలా ఎక్సయిటింగ్ నాకు. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఆయనకి అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్ కి రెండు మూడుసార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్ గారు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. చాలా నచ్చింది. అందులోనూ ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది. అందుకే మెహర్ రమేష్ గారు చెప్పినప్పుడే చిరంజీవి గారితో డ్యాన్స్ స్టెప్స్ వుండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను.
 
ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఇది చిరంజీవి గారు, కీర్తి సురేష్..  బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా వుండే మూవీ. ఇందులో నాది క్యామియో రోల్. నా పాత్ర చాలా ఛార్మింగ్ గా వుంటుంది. చిరంజీవి గారు, కీర్తి సురేష్, తమన్నా తో నాకు కీలకమైన సన్నివేశాలు వుంటాయి. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్ గా చేశాం. కీర్తి సురేష్ గారితో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చిరంజీవి గారితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎక్సయిమెంట్ అనిపించింది. చిరంజీవి గారిలోని ప్రత్యేక ఏమిటింటే .. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. ఇందులో ఆయన టాక్సీడ్రైవర్ గా వుండగా ఒక సీన్ చేశాం. అందులో నేను పాసింజర్ ని. ఆయన డోర్ తీస్తుంటే నాకు ఏదోలా అనిపించింది. నేనే డోర్ తీసి బయటికి వస్తుంటే.. ‘’ఇందులో నీ గౌరవం కనిపించిపోతుంది.  నేనే తీయాలి’ అని చాలా వివరంగా చెప్పారు. అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత నేను ఒక కంఫర్ట్ ఫుల్ జోన్ లోకి వచ్చాను. అలాగే చివర్లో తీసిన పాట షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను.
 
చిరంజీవి గారితో సాంగ్ షూటింగ్ అన్నప్పుడు మీ పరిస్థితి ఏమిటి ?
శేఖర్ మాస్టర్ కి ఫోన్ చేశాను. నిజానికి నేను డ్యాన్స్ సాంగ్ చేసి చాలా రోజులైయింది. నా బాడీ యీజ్ కోసం శేఖర్ మాస్టర్ టీంతో రెండు గంటలు ప్రాక్టీస్ చేశాను. సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. చిరంజీవి గారు మాత్రం కూర్చొని మైండ్ లో ప్రాక్టీస్ చేసేస్తున్నారు. తమన్నా కీర్తి కూడా మంచి డ్యాన్సర్స్. నలుగురం ఫ్రేమ్ లో వున్నప్పుడు నా మూలంగా స్టెప్ మార్చకూడదు కదా. అందుకే ప్రతి స్టెప్ ని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది. చాలా కలర్ ఫుల్ గా వుంది. సినిమాలో ఈ పాట ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.  
 
వేదాలం చూశారా ?
లేదండీ.  చెప్పినప్పుడు చూడాలని అనుకున్నాను. ఐతే ఇందులో నా పాత్రని చాలా మార్చామని, పాత్ర నిడివిని కూడా పెంచామని, ఒకవేళ అది చూసిన రిఫరెన్స్ పాయింట్ గా ఉండదని డైరెక్టర్ గారు చెప్పారు. నిజానికి ఇందులో నా పాత్రని చాలా ఫ్రెష్ గా డిజైన్ చేశారు. కొన్ని హై ఇచ్చే సీన్స్ కూడా వుంటాయి. నన్ను చాలా బాగా ప్రజంట్ చేశారు.  లుక్ పరంగా చాలా హ్యాపీగా వున్నాను. భోళా మానియాలో నా పాత్ర చిన్న బ్రీజ్ లా వుంటుంది. ఇక చిరంజీవి గారి పాత్రలో చాలా షేడ్స్ వున్నాయి. ఇందులో మెగాఫ్యాన్స్ కి కావాల్సినదాని కంటే ఎక్కువ ఉంటుంది.
 
చిరంజీవి గారు మీ తాతగారితో కూడా చేశారు.? ఆయనతో సెట్స్ లో ఎలా వుంటుంది ?
సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. ‘ఇది మీ తాతగారి స్టెప్’ అని సెట్ లో వేసి చూపించారు. తాతగారి గురించి, సినిమా కబుర్లు.. ఇలా చాలా విషయాలు పంచుకుంటారు. ఇందులో పాత్ర కోసం మెహర్ గారు నా పేరు చెప్పినపుడు చాలా బావుటుందని చిరంజీవి గారు కూడా అన్నారు. అల వైకుంఠపురములో చిత్రానికి ఓ అవార్డ్ ని చిరంజీవి గారి చేతులు మీద తీసుకున్నాను. మళ్ళీ రావణాసుర ఓపెనింగ్ కి వచ్చారు. అయితే ఆయనతో కలసి సినిమా చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆయనతో  సినిమా చేసే ఛాన్స్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. చిరంజీవి గారు, మెహర్ రమేష్ గారు, అనిల్ సుంకర గారు చాలా బాగా చూసుకున్నారు. ఇంత మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఇది చాలా మెమరబుల్ మూవీ. ఈ సినిమా కోసం జీవితంలో తొలిసారి కలకత్తా వెళ్లాను. నేను సోలోగా సినిమా చేసినా ఇంత హై రాదు. జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది.
 
చిరంజీవి గారితో సినిమా అంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏమిటి ? ముఖ్యంగా చిన్న మావయ్య గారిది ?
చిరంజీవి గారి సినిమాలో చేస్తున్నాని చిన్న మావయ్యతో చెప్పాను. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ముఖ్యంగా డ్యాన్స్ సాంగ్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీలయ్యారు.
 
కీర్తి సురేష్ గారితో పెయిర్ గా చేయడం ఎలా అనిపించింది ?
కీర్తి అద్భుతమైన నటి. మహానటి సావిత్రి బయోపిక్ తో అందరి మనసులో చెరగని ముద్ర వేశారు. భోళా శంకర్ లో మా కెమిస్ట్రీ  నేచురల్ గా వచ్చింది. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అది మీకు తెరపై కనిపిస్తుంది.
 
అల్లు అర్జున్, చిరంజీవి గారు .. ఇద్దరితో డ్యాన్స్ చేశారు కదా?  ఎలా అనిపించింది ?  
డ్యాన్స్ మొదలైయిందే చిరంజీవి గారితో. బన్నీకి కూడా చిరంజీవి గారే స్ఫూర్తి. దేనికదే ప్రత్యేకం. ఐతే ‘అల వైకుంఠపురములో’ రాములో రాముల పాటకి, ఇందులో జామ్ జామ్ పాటకి.. పండగ వాతావరణం ఒకలా వుంటుంది.
 
దర్శకుడు మెహర్ రమేష్ గారు సెట్స్ లో ఎలా వుండేవారు ?
 మెహర్ రమేష్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. దాదాపు మూడేళ్ళు ఈ ప్రాజెక్ట్ తో ప్రయాణించారు. ఆయనపడిన కష్టం చూశా. చిరంజీవి గారిని ఎలా ప్రజంట్ చేయాలి, అభిమానులని ఎలా అలరించాలి, కొత్తగా ఎలా చూపించాలనే ఆలోచనతో  వుండేవారు. అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన కోసం ఈ సినిమా  తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.  
 
సోలో హీరోగా కెరీర్ ని ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ?
రెండు కథల మీద వర్క్ జరుగుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత అనౌన్స్ చేస్తాం.
 
డ్రీమ్ రోల్స్ ఉన్నాయా ?
ఒకదానికొకటి ప్రత్యేకంగా వుండే పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు జరుగుతున్న రెండు కథలు కూడా ఇప్పటివరకూ నేను చేయని పాత్రలే. వాటిలో చాలా భిన్నంగా కనిపిస్తాను.