సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 31 జులై 2023 (16:29 IST)

రామ్‌ చరణ్‌తో రాథే గోవింద సాంగ్‌ రీమేక్స్‌ చేయాలనుంది : మహతీ స్వరసాగర్‌

Mahati sagar
Mahati sagar
సంగీత దర్శకుడు మణిశర్మ వారసుడు కీబోర్డ్‌ ప్లేయర్‌ మహతీ స్వరసాగర్‌. ఛలో సినిమాతో మంచి మెలోడీ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆతర్వాత పలు సినిమాలు చేస్తూ తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళా శంకర్‌కు బాణీలు సమకూర్చారు. ఆగస్టు 11న విడుదలకానున్న ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. నాన్నగారు మణిశర్మ సినిమాలకు పనిచేశారు. ఆయన చేయలేని కొత్త సౌండ్‌ సిస్టమ్‌ను నేను వినిపించాలని ప్రయత్నించి చిరంజీవిగారికి కొత్త ఫార్మెట్‌లో చేశాను. అందుకు ఆయన బాగా అభినందించారు. నాకు చిరంజీవిగారి సినిమాలంటే పిచ్చి. ఇంద్ర సినిమాను దాదాపు 600సార్లు చూశాను. ఆ సినిమాలో సంగీతం బాగా ఇన్‌స్పైర్‌ చేసింది.
 
మా ఇంట్లోనే విమర్శకులున్నారు. నేను ఏది ట్యూన్‌ చేసినా బాగుందో, లేదో వెంటనే మా అమ్మగారు, నాన్నగారు ఇట్టే చెప్పేస్తారు. అలా వారినుంచి బయటపడిందంటే చాలు సినిమాపై నాకు పూర్తి నమ్మకం వుంటుంది. భోళాశంకర్‌లో చిరంజీవి ఇన్‌పుట్స్‌ కూడా బాగా ఉపయోగపడ్డాయి. నేను నాన్నగారి సంగీతంలో రీమిక్స్‌ చేయాలనుకుంటే ముందుగా రామ్‌చరణ్‌తో రాథే గోవింద సాంగ్‌కు చేయాలనుంది అని తెలిపారు.