1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (15:22 IST)

మెగా అల్లుడుగా తరుణ్ అంటూ పెళ్లి ప్రచారంపై క్లారిటీ

Tarun
Tarun
టాలీవుడ్ లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశారు.  తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ అవివాహితుడు కావడంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఈ ప్రచారం గురించి  ఆయన మాట్లాడుతూ... ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు.