శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (13:59 IST)

శంకర్ కుమార్తెకు ఆఫర్లు.. ఇండియన్-3 కూడా రెడీ.. రెండు పార్టులుగా..?

Aditi Shankar
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె హీరోయిన్‌గా కోలీవుడ్‌లో అదరగొడుతోంది. తాజాగా శివకార్తీకేయన్‌తో సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
అదితి శంకర్‌కు ప్రస్తుతం ఐదు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అందులో రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ కాగా.. మరో రెండు సెట్స్‌పై వున్నాయి. ఐతే, ఆమె కెరీర్ విషయంలో శంకర్ డైరెక్ట్‌గా ఏమి కలగచేసుకోవడం లేదు. ఆమెకి అవకాశాలు ఇవ్వమని కూడా ఆయన ఎవరికీ ఫోన్ చెయ్యట్లేదట. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
 
ఇకపోతే.. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ నటించిన శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన విషయం కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 
 
ఇండియన్ -2 సినిమా ఫుటేజ్ 6 గంటలు దాటిందని తెలుస్తోంది. దీనిని రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో శంకర్ వున్నట్లు సమాచారం. తద్వారా ఇండియన్-3 కూడా విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదని టాక్ వస్తోంది. 
Kamal poser
Kamal poser
 
ఈ చిత్రంలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, వివేక్, గురు సోమసుందరం, నేదురుమూడి వేణు కీలక పాత్రలు పోషిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.