1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జులై 2023 (18:54 IST)

కోలీవుడ్‌లో అలాంటి నిబంధనేదీ పెట్టలేదు : నటుడు నాజర్

nazar
తమిళ చిత్రపరిశ్రమలో కేవలం తమిళ నటీనటులనే తీసుకోవాలని ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (ఫెప్సీ) కొత్త నియమాలు తీసుకుందంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై 'బ్రో' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ సైతం స్పందించారు. తమిళ చిత్ర పరిశ్రమ అందరికీ అవకాశాలు కల్పించాలని, అన్ని భాషల వాళ్లు కలిస్తేనే అది గొప్ప సినిమా అవుతుందని హితవు పలికారు. 
 
దీనిపై తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడు, సినీ నటుడు నాజర్ స్పందించారు. ఫెప్సీ ఎలాంటి నిబంధన ప్రవేశపెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్‌ను ఉద్దేశించి ప్రస్తుతం చక్కర్లు కొడుతోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదన్నారు. 'ఇతర భాషలకు చెందిన నటీనటులను ప్రోత్సహించకూడదంటూ కొత్త నియమాలు తీసుకువచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ కోలీవుడ్‌లో అలాంటి నియమాలు వస్తే.. వ్యతిరేకించే వారిలో ముందు నేనుంటా. ఇప్పుడు అంతటా పాన్‌ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్‌ కలిస్తేనే మంచి సినిమాలు రూపొందించవచ్చు.
 
తమిళ సినీ కార్మికులను సంరక్షించడం కోసం కొన్ని రూల్స్‌ తీసుకువచ్చింది. అంతేకానీ, ఇతర భాషలకు చెందిన నటీనటుల గురించి కాదు. పవన్‌ కళ్యాణ్‌పై నాకు గౌరవం ఉంది. అందరూ కలిస్తే గొప్ప చిత్రాలు వస్తాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నేనూ అంగీకరిస్తా. ఫెఫ్సీ కొత్త రూల్స్‌పై ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం అందించినట్టు ఉన్నారు' అని నాజర్‌ ఓ వీడియోలో వివరణ ఇచ్చారు.