బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (12:41 IST)

కుమార్తెను చంపి... బైక్‌కు కట్టుకుని డంపింగ్ యార్డ్‌కు ఈడ్చుకెళ్లిన తండ్రి..

crime scene
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమార్తెను చంపేసిన ఓ కన్నతండ్రి.. ఆమె మృతదేహాన్ని బైకుకు కట్టేసి రైల్వే ట్రాక్ పక్కన ఉండే డంపింగ్ యార్డుకు ఈడ్చుకెళ్లాడు. కుమార్తె ప్రవర్తనపై అనుమానం రావడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. 
 
యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత పదునైన ఆయుధంతో ఆమెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తాడుతో బైకుకు కట్టి ఈడ్చుకెళ్లి చెత్త కుప్పలో పడేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అయితే, హత్యకు గల కారణాలు తెలియాల్సివుందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ప్రేమకు అడ్డొస్తున్నాడనీ తండ్రి కాళ్లు విరగ్గొట్టిన కుమార్తె.. ఎక్కడ?  
 
తన ప్రేమకు అడ్డొస్తున్నాడని కన్నతండ్రినే మట్టుబెట్టాలని ఓ కుమార్తె చూసింది. ఇందులోభాగంగా, కొందరు కిరాయి మూకలకు సుపారీ ఇచ్చిన తండ్రి కాళ్లు విరగ్గొట్టింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మధ తాలూకాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ తాలూకాకు చెందిన మహేంద్ర షా అనే వ్యక్తి స్థానికంగా ధనవంతుడు. పైగా వ్యాపారవేత్త కూడా. ఆయన కుమార్తె సాక్షి. ఈమె చైతన్య అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతడితో లేచిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి మందలించాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్న తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న నిర్ణయించింది. ఇందులోభాగంగా, రూ.60 వేల సుపారీ ఇచ్చి నలుగురు రౌడీలను రంగంలోకి దించింది. వారితో తండ్రి కాళ్లు విరగ్గొట్టించేందుకు భారీ కుట్ర పన్నింది.
 
ఈ క్రమంలో తొలుత పూణెకు వెళ్లి ఆదివారం రాత్రి మధకు వచ్చింది. స్థానిక బస్టాండ్‌కు చేరుకున్నాక తండ్రికి ఫోన్ చేసి వచ్చి ఇంటికి తీసుకెళ్లమని కోరింది. కూతురి పన్నాగం తెలియకపోవడంతో తండ్రి కారులో వచ్చి కుమార్తెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే, మార్గమధ్యంలో మూత్ర విసర్జన చేయాలంటూ తండ్రికి చెప్పి, కారును వాడచివాడి గ్రామంలో ఆపాలని ఆమె కోరింది. అప్పటికే వారి కారు కోసం కొందరు వెంబడిస్తున్నారు. ఈ విషయం తెలియని ఆయన కూతురు చెప్పినట్టు కారు ఆపారు. 
 
వారిని వెంబడిస్తున్న దుండగులు యువతి అలా పక్కకు వెళ్లగానే ఒక్కసారిగా మహేంద్ర షాపై దాడి చేసి కిరాతకంగా చావబాదారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు కూడా విరిగిపోయాయి. ఈ దాడిలో ఆయన తనకు తీవ్ర గాయమైంది. దెబ్బలు తాళలేక ఆయన ఆర్తనాదాలు చేయడంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. ఆ తర్వాత గ్రామస్థులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కుమార్తె కుట్ర కోణం వెలుగు చూసింది. దీంతో ఆమెతో పాటు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు దుండగులు, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మహేంద్ర షా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.