రాహుల్ జోడో యాత్రలో విషాదం.. ఎంపీ గుండె పోటుతో మృతి  
                                       
                  
                  				  కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. లుధియానాలో జరిగిన ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. లుధియానా ర్యాలీలోనే ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ర్యాలీలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్తున్నారు. 
	 
	ఎంపీ సంతోక్ మరణించినట్లు ఆ రాష్ట్ర సీఎం భగవంత్  మాన్ సింగ్ ట్వట్టర్‌లో తెలియజేశారు. ఫిల్లౌర్‌లో వాకింగ్ చేస్తున్న సమయంలో నే నీరసపడిపోయారని కుటుంబీకులు తెలిపారు. 
				  
	 
	ఎంపీ మరణంతో రాహుల్ గాంధీ జోడో యాత్రను ఆపేశారు.  ఇకపోతే సంతోక్ సింగ్ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.