సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (10:45 IST)

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు... తొమ్మిది మంది మృతి

accident
accident
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది వరకు గాయాలపాలైనారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సూరత్‌లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ మహోత్సవ్‌కు హాజరైన కొందరు తిరిగి సొంతూళ్లకు లగ్జరీ బస్సులో వెళ్తుండగా... శనివారం తెల్లవారుజామున నవ్‌‌సారి జిల్లాలోని వెస్మా గ్రామ సమీపంలోకి వచ్చేసరికి బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అతడి కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో కారులో వున్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో వున్న 28 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.