శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:30 IST)

కచేరిలో కనకవర్షం.. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై నోట్లు వెదజల్లిన ఫ్యాన్స్

currency notes
స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాలు సేకరించే నిమిత్త ఒక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో గాయకుడు కీర్తిదాన్ గధ్వి పాల్గొని భజన సంకీర్తనలను ఆలపించారు. 
 
ఈ సందర్భంగా ఈ కచ్చేరిలో పాల్గొన్న గాయకులపై అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. ఏకంగా 50 లక్షల మేరకు కరెన్సీ నోట్లను వారిపై వెదజల్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 
 
గుజరాత్ రాష్ట్రంలోని నవ్‌సారి జిల్లాలోని సుపా గ్రామంలో ఈ భజన కచ్చేరి జరిగింది. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన వారు సంగీత కళాకారులపై నోట్ల వర్షం కురిపించారు. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై డబ్బులు వెదజల్లారు. ఇలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా కరెన్సీ నోట్లు వచ్చాయి.