1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Dog Tied To Car, Dragged On Road In Kerala; Driver Arrested

కుక్కను కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.. వీడియో వైరల్

Dog
మూగ జీవాలపై కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ వుంటాయి. తాజాగా బతికున్న ఓ కుక్కను కారుకు వెనుకాల కట్టేసి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న కుక్క బాగా మొరుగుతూ.. అందరికి ఇబ్బంది పెడుతోంది. దీంతో యూసుఫ్(62) అనే వ్యక్తి ఆ కుక్క అరుపులు భరించలేక దాన్ని బంధించాడు. 
 
శుక్రవారం ఉదయం తన కారుకు కుక్కను వెనుకాల కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలను బైక్‌పై వెళ్తున్న అఖిల్ అనే యువకుడు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. ఈ దృశ్యాలు పోలీసులకు చేరడంతో వారు అప్రమత్తమయ్యారు. ఈ అమానుషాన్ని గమనించిన అఖిల్ అనే బైకర్ వీడియో తీశారు.  ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తామంటూ ఆయన  యూసఫ్‌ను అడ్డుకుని ప్రశ్నించారు. 
 
అయితే... నీకేంటి సమస్య అంటూ వాదించిన యూసఫ్‌ చివరకు కుక్కకు కట్టిన తాడును వదిలించి అక్కడినుంచి వెళ్లి పోయారు. దీనిపై వ్యవహారంపై అఖిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కను కారుకు కట్టేసి ఈడ్చుకెళ్లిన యూసుఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
24 గంటల్లో 30వేల కొత్త కేసులు..