సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయ్..

తెలంగాణలో కేసులు తగ్గుతూ పెరుగుతూ వున్నాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు, శనివారం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొంత మేర పెరిగాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో నలుగురు మృతి చెందారు. 
 
రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,77,151కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,67,992 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,670 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 1,489 మంది మృతి చెందారు.
 
శుక్రవారం ఒక్కరోజు 565 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉంది. అలాగే రికవరీ రేటు దేశంలో 94.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96.69 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు.