Sandhigdham: సందిగ్ధం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది : పార్ధసారథి
Sandhigdham, Nihal, Priya Deshpande and others
దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ .. సందిగ్ధం ప్రయాణంలో నా భార్య సంధ్య ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ మా కోసం ఎంతో కష్టపడ్డారు. అందరూ సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా కలిసి సపోర్ట్ చేయడం వల్లే సినిమాని ఇంత బాగా తీయగలిగాం. సందిగ్ధం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మే 29న మా సినిమాని చూసి ఆడియెన్స్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
నిహాల్ మాట్లాడుతూ .. సందిగ్ధం చిత్రీకరణలో నాకు దర్శక, నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. వారిద్దరూ ఎన్నో కష్టాలను దాటుకుని మూవీని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. మే 29న మా మూవీని చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
కాజల్ తివారి మాట్లాడుతూ .. నాకు తెలుగు అంతగా రాదు. సెట్‌లో ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. సందిగ్ధంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా చిత్రం మే 29న రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.
అర్జున్ మాట్లాడుతూ, మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు పార్థు గారికి థాంక్స్. నిర్మాత సంధ్య గారు మాకెంతో సపోర్ట్ చేశారు. మూవీలో నటించిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. మే 29న మా సినిమాని చూసి విజయం అందిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
సంగీత దర్శకుడు గౌతమ్ రవిరామ్ మాట్లాడుతూ, మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. పార్థసారధి మూవీని డిఫరెంట్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది అని అన్నారు.
నటుడు ఆనంద్, నవీన్ రాజ్, చిట్టి బాబు మాట్లాడుతూ .. సందిగ్ధం మూవీని అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగుంటుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
